వరుస విజయాలతో హీరోగా దూసుకెళుతున్నారు సుమంత్ అశ్విన్. మంచి కథలు, పాత్రలు ఎంపిక చేసుకుంటున్న ఈ యువహీరో ప్రస్తుతం నటించిన చిత్రం ‘కొలంబస్’. డిస్కవరీ ఆఫ్ లవ్ అనేది ఉపశీర్షిక. ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆర్. సామల దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది.
‘కొలంబస్’ విశేషాలను సుమంత్ అశ్విన్ చెబుతూ – ”లవర్స్, కేరింత.. ఇలా వరుస విజయాల తర్వాత నేను చేసిన చిత్రం ఇది. కథ విని, వెంటనే అంగీకరించాను. అంతగా ఈ కథ నన్ను ఎగ్జయిట్ మెంట్ కి గురి చేసింది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎమోషన్స్ కు కూడా ప్రాధాన్యం ఉన్న కథ. అందుకే కనెక్ట్ అయిపోయాను. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది. నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో నా సరసన ‘రన్ రాజా రన్’ ఫేం సీరత్ కపూర్, ‘చిన్నదాన నీ కోసం’లో చేసిన మిస్తీ చక్రవర్తి కథానాయికలుగా నటించారు. ‘ఇష్క్’ సినిమాకి రచయితగా పని చేసిన ఆర్. సామల ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిర్మాత సహదవ్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. జితిన్ మంచి పాటలు ఇచ్చారు. ఇది రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్ టైనర్. సీన్స్ అన్నీ ఫ్రెష్ గా ఉంటాయి. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ లో పాటలను, నవంబర్ మొదటి వారంలో సినిమాని విడదల చేయాలనుకుంటున్నాం” అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: జితిన్, కెమెరా: భాస్కర్ సామల, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి.