‘‘సార్… ఇక్కడ మనిషి చావు న్యూసే. మనిషి జ్ఞాపకాలూ న్యూసే. ప్రేమ న్యూసే. స్నేహం న్యూసే. చేయాలనుకుంటే… ప్రపంచంలో ప్రతిదీ న్యూసే. అది ఎన్‌క్యాష్ (డబ్బుగా మార్చుకోవడం) చేసుకోవడం తెలుసుకోవాలి. అవసరం అయితే ఆ న్యూస్ క్రియేట్ చేయడం కూడా తెలుసుండాలి. అది నాకు తెలుసు’’ – ఇదీ ‘ఇదం జగత్’లో సుమంత్ చెప్పిన డైలాగ్! అందులో చివరి రెండు లైన్లు ప్రస్తుత మీడియాలో కొంతమంది వ్యవహారశైలి మీద ఇది సెటైరికల్ సినిమానా? అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. ‘న్యూస్ క్రియేట్ చేయడం’… ‘న్యూస్ క్రియేట్ చేయడం నాకు తెలుసు అనడం’ డైలాగులకు అర్థం ఏమిటో? టీజర్లో సుమంత్ లుక్ కంటే డైలాగ్ మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. ‘మళ్లీ రావా’ విజయం తరవాత సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో అతను వీడియోగ్రాఫర్‌గా నటిస్తున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో జోన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.