కావల్సినంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలం అవుతూనే ఉన్నాడు సుమంత్. గోదావరి, సత్యం మినహాయిస్తే సుమంత్ ఖాతాలో విజయాలేం లేవు. భారీ ఆశలు పెట్టుకొన్న ‘నరుడా.. డోనరుడా’ కూడా దారుణంగా నిరాశ పరిచింది. ఇప్పుడు సుమంత్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ‘మళ్లీ రావా’ చిత్రం రూపుదిద్దుకొంటోంది. గప్ చుప్‌గా షూటింగ్ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు ఓ చిన్న టీజర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ‘‘13 ఏళ్ల తర్వాత అంజలీని మళ్లీ చూశాను.. అంజలీని అలా చూస్తూ వుండాలనిపించింది, గుర్తు పట్టలేదా, గుర్తు కూడా లేదా? అనే డైలాగ్ చూస్తే ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. సుమంత్‌కి ఇలాంటి కథలు బానే సూటవుతాయి. ఎదురు దెబ్బలు తిన్నాడు కాబట్టి.. కథ, కథనాల విషయంలో ఈసారి జాగ్రత్తగానే ఉంటాడనిపిస్తోంది. టీజర్ చూస్తే కథలో విషయం ఉన్నట్టే ఉంది. అన్నీ కలిసొస్తే… ఓ హిట్టు కొట్టినా కొట్టొచ్చు. చూద్దాం.. సుమంత్‌కి కాలం కలిసొస్తుందో లేదో?