కవిత్వంలో చందమామ ఎంతటి అందమైన పోలికో, తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా తెలుగు పాటలో గోదారి గట్టు అంతటి అందమైన లిరిక్. మూగ మనసులు సినిమా గోదారి గట్టుంది పాట ఓ క్లాసిక్. ఇక మోడరన్ తెలుగులో సినిమాలో కూడా గోదారి గట్టు చాలా పాపులర్. మహేష్ బాబు రాజకుమారుడు సినిమాలో గోదారి గట్టుపైన పాట చాలా పాపులర్. ఇటివలే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టుపైన సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమాపై ఈ పాటే చాలా బజ్ క్రియేట్ చేయగలిగింది.
ఇలాంటి క్యాచి లిరిక్ ని యువ హీరో సుమంత్ ప్రభాస్ తన సినిమాకి పెట్టుకున్నాడు. మేము ఫేమస్ తో పరిచయమైన సుమంత్, సుభాష్ చంద్ర దర్శకుడిగా ఓ సినిమా చేస్తున్నాడు. జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి ‘గోదారి గట్టుపైన’ అనే టైటిల్ పెట్టారు. గోదావరి జిల్లాల వేల్పూరు, తణుకు, రేలంగి, భీమవరం నేపథ్యంలో సాగే సినిమా ఇది. దానికి తగ్గట్టు ఈ సినిమా ఈ పేరు ఖారారు చేసుకున్నారు. మొత్తానికి పాపులర్ టైటిల్ నే పట్టేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది.