అక్కినేని ఇంటి నుంచి వచ్చిన హీరో సుమంత్‌కి ఈమధ్య సినిమాలేం లేవు. సీతారామం లో కీలక పాత్ర పోషించాడు. తరవాత హీరోగా తన నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఇటీవలే.. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కింది. దీనికి `వారాహి` అనే పేరు పెట్టారు. రంగమార్తండ ఫేమ్ మధు నిర్మాత.
సుమంత్ కి పెద్దగా మార్కెట్ లేదు. ఓటీటీని నమ్ముకొని కూడా సినిమా తీసేంత ధైర్యం ఎవరికీ లేదు. సుమంత్ తో సినిమా అంటే రూ.4-5 కోట్ల మధ్యే పూర్తవ్వాలి. కానీ ఇటీవల వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. ఆ షెడ్యూల్‌కే రూ.1.5 కోట్లయ్యాయట. సినిమా పూర్తయ్యేసరికి ఏ పది కోట్లో లెక్క తేలుతుందని నిర్మాత కంగారు పడుతున్నట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. అయితే సుమంత్ మాత్రం `బాగా ఖర్చు పెట్టండి.. అప్పుడే కదా క్వాలిటీ సినిమా వస్తుంది` అంటున్నాడట. అంతే కాదు. ఓటీటీ బిజినెస్ నేను చూసుకొంటా, మన బడ్జెట్ అంతా ఓటీటీ నుంచే వచ్చేస్తుందని నిర్మాతకు భరోసా ఇస్తున్నాడట. ఎలాగూ సినిమా మొదలెట్టేశాం కదా అని నిర్మాత కూడా ఏమీ అనలేకపోతున్నాడు.