సుమంత్ అంటే.. క్లీన్ అండ్ గ్రీన్ లుక్కే గుర్తొస్తుంది. గోదావరి లాంటి సినిమాల్లో సుమంత్ చాలా పద్ధతిగా కనిపించాడు. దాదాపుగా అన్ని సినిమాల్లోనూ తన లుక్ ఒకేలా ఉంటుంది. అయితే.. ఇప్పుడు తన లుక్ తో సర్ప్రైజ్ ఇచ్చాడు.
వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్ కథానాయకుడు. ఈ చిత్రంలో సుమంత్ కూడా ఉన్నాడు. బ్రిగాడియర్ విష్ణు శర్మగా సుమంత్ ని పరిచయం చేశారు. బ్రిగాడియర్ అనేది ఇండియర్ ఆర్మీలో ఓ కీలకమైన పదవి. సుమంత్ కూడా ఆర్మీ లుక్‌లోనే కనిపించాడు. మీసాలు మెలేస్తూ.. కొత్తగా దర్శనమిచ్చాడు. ”కొన్ని యుద్ధాలు మొదలుపెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంది. ముగింపు కాదు…” అనే డైలాగ్ తో ఈ పాత్రని పరిచయం చేశారు. ఒక రకంగా.. ఈ సినిమాతో సుమంత్ కు కొత్త ఇన్నింగ్స్ మొదలైందని చెప్పొచ్చు. ఈ సినిమా గనుక క్లిక్ అయితే… ఈ తరహా సీరియస్ రోల్స్ కోసం సుమంత్ పేరుని పరిశీలించే అవకాశం ఉంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆగస్టు 5న విడుదల కాబోతోంది.