అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుమంత్ చేసిన సినిమాలు 20కి పైగా ఉన్నా చెప్పుకోదగ్గవి మాత్రం రెండో మూడో.. మేనళ్లుడి కోసం స్వయానా నాగార్జున రంగంలో దిగి ఇద్దరు కలిసి సినిమా తీసినా పని కాలేదు. సినిమాలైతే సంవత్సరానికో రెండు సంవత్సరాలకో తీస్తున్నా సుమంత్ వాటిని హిట్ బాట పట్టించడంలో మాత్రం విఫలమయ్యాడు. అయితే ఇక లాభం లేదని ఈసారి కొత్తగా ప్రొడ్యూసర్ అవతారం ఎత్తుతున్నాడు.
సినిమాకో కొత్త హీరో పరిచయమవుతున్న ఈ కాలంలో హీరోగా ఇమేజ్ సాధించాలంటే ఏదో ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ థింగ్ ని డెవెలప్ చేసుకుంటున్నారు కుర్ర హీరోలు. అయితే దాదాపు పరిశ్రమకు ఎప్పుడో వచ్చిన సుమంత్ మాత్రం ఇంకా ఆడియెన్స్ పల్స్ పట్టుకోలేకపోయాడు. అక్కినేని అభిమానుల అండ ఏమైనా ఉందా అంటే అది కరువైపోయింది. అందుకే ఇక హీరోగా కాకుండా నిర్మాతగా ముందడుగేయాలనుకుంటున్నాడు.
దీనికి సంబంధించిన ఒక వీడియోని కూడా సుమంత్ తన ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడం జరిగింది. హీరోగా మెప్పించలేని సుమంత్ ప్రొడ్యూసర్ గా అయినా ఓకే అనిపించుకుంటాడా అనే డౌట్ వస్తున్నా.. మామయ్య నాగ్ ని చూసైనా క్వాలిటీతో కూడిన చిన్న బడ్జెట్ సినిమాలు తన బ్యానర్లో తీయాలానే ఉద్దేశంతో ఉన్నాడు సుమంత్. ప్రస్తుతం ఫ్యాషనేట్ గా నడుస్తున్న ఈ మూవీ ప్రొడక్షన్ మోజులో సుమంత్ కూడా చేరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో హీరోగా సక్సెస్ అవ్వలేని సుమంత్ కనీసం నిర్మాతగా అయినా సూపర్ హిట్లు కొట్టాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులు.