ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు రోజు రోజుకీ ఉగ్ర రూపం దాలుస్తున్నాడు. జనాలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. సినిమా షూటింగులకూ ఎండ దెబ్బ తగులుతోంది. తాజాగా… బాహుబలి టీమ్ ఎండలకు హడలిపోతోంది. అందుకే రాజమౌళి.. నెల రోజుల పాటు షూటింగ్‌కి సెలవలు ప్రకటించేశారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో బాహుబలి షూటింగ్ జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. పూర్తయిన వెంటనే 30రోజలు సెలవు ప్రకటించారు. మే నెలాఖరున మళ్లీ షూటింగ్ మొదలెడతారట.
అయితే ఈ సెలవలు నటీనటులకు మాత్రమే అని తెలిసింది. సాంకేతిక నిపుణులు మాత్రం కష్టపడాల్సిందే. ఇప్పటి వరకూ అయిన షూటింగ్‌కి సంబంధించిన ఎడిటింగ్, గ్రాఫిక్స్ పనుల్ని ఈ సెలవుల్లో పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. 2017 ఏప్రిల్‌లో బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. అలా అనుకొన్న టైమ్‌కి ఈ సినిమా రావాలంటే.. ఇప్పటి నుంచే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలెట్టేయాలి. అందుకే రాజమౌళి నటీనటులకు సెలవిచ్చి.. డబ్బింగ్, రికార్డింగ్ థియేటర్లో గడపబోతున్నాడన్నమాట.