చిరంజీవి 150వ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాట ఆ ఆశలు, అంచనాలపై నీళ్లు చల్లింది. మరీ రొటీన్ బీట్… రిలిక్స్ కావడం, కాపీ ముద్ర పడడంతో ఖైదీ నెం.150పై లేనిపోని డౌట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో.. ఇప్పుడు రెండో పాట వచ్చింది. సన్నాజాజిలా పుట్టేసిందిరో.. మల్లెతీగలతా చుట్టేసిందిరో.. అంటూ రెండో పాట వదిలారు. శ్రీమణి సాహిత్యం, దేవి ట్యూను.. పాడిన విధానం.. ఓవరాల్‌గా చూస్తే ఈ పాట ఓకే అనిపిస్తుంది. వినగా వినగా ఎక్కేసే ఛాన్సులున్నాయి. ‘అమ్మడు’ పాటతో పోలిస్తే.. అద్భుతంగా ఉందనే చెప్పాలి. అయితే.. ఇక్కడ చిరు అభిమానులు ఖుషీ అయ్యే ప్రధానమైన విషయం. ఈ పాటలో కనిపిస్తున్న చిరు లుక్స్. అమ్మడు పాటలో కంటే యంగ్‌గా.. అందంగా కనిపిస్తున్నాడు చిరు. చిరు స్టైలింగ్ విషయంలో తీసుకొన్న కేర్… ఆ పిక్స్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. చిరు గ్రేసీ డాన్సులు, చిన్న చిన్న మ్యాజిక్ మూమెంట్స్ వేయడంలో దిట్ట! ఇలాంటి పాట దొరికితే చెలరేగిపోతాడు. అందుకే.. ఈ పాటలో అప్పుడే చిరు స్టెప్పుల్ని అభిమానులు ఊహించేసుకొంటున్నారు. శ్రీమణి సాహిత్యం వింటుంటే.. అచ్చంగా దేవిశ్రీ ప్రసాద్ రాసిన నిన్ను చూడగానే చిట్టి గుండె గడ్డిగానే కొట్టుకొన్నదే.. పాట గుర్తుకొస్తుంది. రచయితగా దేవి ప్రభావం శ్రీమణిపై కనిపిస్తోంది. అన్నట్టు ఖైదీ నెం. 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ముహూర్తం ఫిక్సయ్యింది. జనవరి 4న తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని చిత్రబృందం ప్రకటించింది.