ఈమధ్య వినాయక్ తన సొంత ఇంటిని అమ్ముకొన్నట్టు వార్తలొచ్చాయి. ‘అఖిల్’ దెబ్బకి వినాయక్ బాగా డంగైపోయాడని, ఆర్థికంగానూ నష్టపోయాడని, అందుకే ఫిల్మ్నగర్లో ఎంతో ఇష్టపడి కట్టుకొన్న కొత్త ఇల్లు… అర్జెంటుగా అమ్మేశాడని వార్తలొచ్చాయి. ”అమ్మిన మాట నిజమే గానీ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల కాదు, సెంటిమెంట్ కోసమే” అని చెప్పుకొన్నాడు వినాయక్. ఆ సంగతి పక్కన పెడితే, వినాయక్ ఇల్లు కొన్నదెవరో బయటకు వచ్చింది. ఆ ఇంటిని యువ హీరో సందీప్ కిషన్ చేజిక్కించుకొన్నాడట. ఈ విషయాన్ని సందీప్ కూడా దృవీకరించాడు. ”నిజానికి ఆ ఇల్లు మా సొంత మేనమామది. ఆయన దగ్గర్నుంచి వినాయక్ దగ్గరకు వెళ్లింది. ఇప్పుడు నేను సొంతం చేసుకొన్నా. నా కష్టార్జితంతో కొనుక్కొన్న తొలి ఆస్తి ఇదే” అంటున్నాడు సందీప్.