నిను వీడని నీడను నేనేతో కాస్త ఫామ్‌లోకి వచ్చాడు సందీప్ కిషన్. రేపు `తెనాలి రామకృష్ణ బి.ఏ, బి.,ఎల్` విడుదల కాబోతోంది. టైటిల్ ఎఫెక్టో, కామెడీ సినిమా అనో, లేదంటే సందీప్ హిట్టు కొట్టాడనో తెలీదు గానీ, ఈ సినిమాకి బిజినెస్ బాగానే జరిగింది. శాటిలైట్‌తో కలుపుకుని దాదాపు 7 కోట్లకు బిజినెస్ పూర్తయింది. సందీప్ రేంజుకి ఇది ఎక్కువే అని చెప్పాలి. ట్రైలర్లు ఆకట్టుకోవడం, టైమ్ పాస్ సినిమా అనే గ్యారెంటీ కలగడంతో బిజినెస్ బాగానే జరిగింది. అంతేకాదు.. కొన్ని జిల్లా కేంద్రాలలో ఈ సినిమా ప్రీమియర్లు వేస్తున్నారు. ఈరాత్రే ప్రీమియర్లు మొదలైపోతాయి. స్టార్ హీరోల సినిమాలకే ప్రీమియర్లు వేయడానికి నిర్మాతలు భయపడిపోతుంటారు. టాక్ బయటకు వస్తే.. ఉదయానికి కల్లా థియేటర్లు ఖాళీ అయిపోతాయని భయం. కానీ కేవలం సినిమాపై నమ్మకంతో నిర్మాతలు ఈ ధైర్యం చేశారు. చాలా రోజుల తరవాత హన్సిక మళ్లీ తెలుగు తెరపై కనిపించనుంది. ఆమె గ్లామర్ ఈసినిమాకి ప్రధాన ఆకర్షణ కానుంది.