వరుస ఫ్లాపులతో అల్లాడుతున్నాడు సందీప్ కిషన్. గతేడాది చివర్లో విడుదలైన `తెనాలి రామకృష్ణ` కూడా ఘోరంగా బోల్తా కొట్టింది. ఇప్పుడు తన ఆశలన్నీ `ఏ 1` ఎక్స్ప్రెస్ పైనే. హాకీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. జీవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే.. అనుకోకుండా ఈ సినిమాకి బ్రేక్ పడిందని తెలుస్తోంది. ఈ సినిమా ఫుటేజ్ చూసుకున్న సందీప్ కాస్త అసంతృప్తిలో ఉన్నాడని టాక్. జీవన్ ఈ సినిమాని హ్యాండిల్ చేయలేకపోతున్నాడని, జీవన్ స్థానంలో మరొకర్ని దర్శకుడిగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలో సందీప్ ఉన్నాడని తెలుస్తోంది. ఇదో తమిళ చిత్రానికి రీమేక్. మాతృక తీసిన దర్శకుడిని తీసుకొచ్చి, సినిమాని పూర్తి చేయాలని భావిస్తున్నాడట. జీవన్ ఉంటాడు గానీ, డైరెక్షన్ బాధ్యతంతా తమిళ దర్శకుడు చూసుకునే అవకాశాలున్నాయి.