`ఓ బేబీ`తో ఓ సూపర్ హిట్టు కొట్టింది నందిని రెడ్డి. ఆ తరవాత ఇప్పటి వరకూ మరో సినిమా మొదలెట్టలేదు. ఆమధ్య సమంత – నందినిరెడ్డి కాంబినేషన్లో మరో సినిమా వస్తుందని చెప్పారంతా. కానీ.. దాని గురించి కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే ఇప్పుడు నందిరెడ్డి ఓ కొత్త సినిమా మొదలెడుతోందని సమాచారం. ఇందులో సందీప్ కిషన్ హీరో. పీపుల్స్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కథ ఓకే అయిపోయింది. `అలా మొదలైంది`, `ఆహా కల్యాణం` జోనర్లో సాగే ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని తెలుస్తోంది. కథానాయిక పాత్రకి చాలా ప్రాధాన్యం ఉందట. ఆ పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ కనిపించే ఛాన్సుంది. ప్రస్తుతం సందీప్ కిషన్ `ఏ 1 ఎక్స్ప్రెస్`లో నటిస్తున్నాడు. జి.నాగేశ్వరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా మొదలైంది. జనవరిలో గానీ, ఫిబ్రవరిలో గానీ నందిరెడ్డి సినిమా మొదలయ్యే ఛాన్సుంది.