ఈమధ్య చిన్న సినిమాల హవా ఎక్కువగా కనిపిస్తోంది. నిన్న బేబీ, మొన్న సామజవరగమన సూపర్ హిట్లు గా నిలిచాయి. బేబీ యూత్ ని ఆకట్టుకొంటే, సామజవరగమ ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చింది. ఈ సినిమాతో శ్రీవిష్ణు కొంచెం తెరిపిన పడ్డాడు. వరుస ఫ్లాపులకు ఈ సినిమా బ్రేక్ వేసింది. బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా దాదాపు రూ.40 కోట్లు వసూలు చేసింది. నిజానికి ఈ కథ ముందుగా సందీప్ కిషన్ దగ్గరకు వెళ్లింది. తనకు ఈ కథ బాగా నచ్చింది. తనే నిర్మాత రాజేష్ దండా దగ్గరకు ఈ కథ పంపాడు. అన్నీ ఓకే అనుకొంటున్న తరుణంలో సందీప్ కిషన్ తన ప్రాజెక్టుల హడావుడిలో పడిపోయాడు. ముఖ్యంగా మైఖేల్ సినిమాకి డేట్లు ఇచ్చేయడం వల్ల.. ఈ సినిమా చేయలేకపోయాడు. సందీప్ డ్రాప్ అవ్వడం వల్లే, ఈ కథ శ్రీవిష్ణు దగ్గరకు వెళ్లింది. అలా.. సందీప్‌కి ఓ హిట్టు చేజారింది. మైఖేల్ కోసం ఈ సినిమాని వదులుకొన్న సందీప్‌కి మైఖేల్ కూడా హ్యాండిచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకొన్న మైఖెల్ ఫ్లాప్ అయ్యింది. మనం తినే ప్రతీ బియ్యపు గింజపై తినేవారి పేరు రాసి పెట్టుంటుందట. అలా చేసే ప్రతీ సినిమాపై హీరో పేరు రాసి పెట్టుంటుంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, చేయకపోయినా.. వాళ్ల దగ్గరకే ప్రాజెక్టులు వెళ్తుంటాయి. అందుకు సామజవగరమననే పెద్ద నిదర్శనం.