సినిమా తీయడం ఎంత ముఖ్యమో. ప్రమోషన్లు చేసుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. ఈ విషయాన్ని సందీప్ కిషన్ కూడా బాగానే గ్రహించినట్టు అనిపిస్తోంది. వరుస ఫ్లాపులు ఎదుర్కుంటున్న సందీప్‌కి ఇప్పుడు ఓ హిట్టు కొట్టడం అత్యవసరం. అందుకే `నిను వీడని నీడనునేనే` విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. ఈ సినిమాకి నిర్మాత కూడా తనే. అందుకే.. ప్రమోషన్లు కూడా బాగానే ప్లాన్ చేస్తున్నాడు. థియేటర్లలో, షాపింగ్ మాల్స్‌లో టాయిలెట్లలో కూడా `నిను వీడని నీడను నేనే` ప్రమోషన్లను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసమేయ దొంగగా మారాడు.
ఓ ఇంటి ముందున్న బైక్‌ని ముసుగేసుకెళ్లి మరీ దొంగిలించాడు సందీప్. ఆ బైక్ ఎవరిదో కాదు… హాస్య నటుడు ప్రియదర్శిది. ఈ తతంగం అంతా ఓ వీడియోలో చిత్రీకరించి, దాన్ని కూడా ప్రచారంలో వాడుకుంటున్నాడు సందీప్. నిజానికి ఈ సినిమాలో ప్రియదర్శిని ఎంచుకుందామనుకున్నారు. కానీ తన డేట్లు అందుబాటులోలేకుండా పోయాయి. ప్రియదర్శిని ఎలాగూ వాడుకోలేదని, తన బైక్‌ని ఇలా వాడుకున్నాడు సందీప్. అయితే తన బైకుని సరదాగా ఎత్తుకెళ్తున్నారన్న విషయం తెలీక ప్రియదర్శి కాస్త సీరియస్ అయ్యాడట.
‘ఈ విషయం మేం అనుకున్నదానికన్నా సీరియస్ అవుతోంది. ఇది ప్రచారం కోసం చేసిన పని. మాకు ప్రియదర్శి డేట్లు దొరకలేదు. దాంతో సినిమాలో ఆయన బైక్‌ను చూపించాలని తీసుకెళ్లాం. నాకు ఈ బైక్ నడపడం చాలా నచ్చింది. లవ్యూ దర్శి బాయ్’ అని ట్వీట్ చేస్తూ బైక్ నడుపుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ‘నా బైక్‌కి నీ సినిమా ద్వారా బ్రేక్ ఇచ్చినందుకు థాంక్స్ అన్నా’ అంటూ ప్రియదర్శి కూడా స్పందించాడు. ప్రమోషన్ల వరకూ సందీప్ బాగానే ఆలోచిస్తున్నాడు. ఇదే ఎఫెక్ట్ సినిమాలోనూ చూపిస్తే.. తన కల నెరవేరినట్టే.
Sorry this got more serious than we expected..it's a fun promotional campaign that we are doing for #NinuVeedaniNeedaniNene ..
As we dint get @priyadarshi_i dates..we had his bike make a special appearance in our film..
PS: I loved riding it ❤️
Love you Darshi boy ??? pic.twitter.com/sx6DbUN4Sh— Sundeep Kishan (@sundeepkishan) July 8, 2019