తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ `ఆదిత్య 369` ఓ వినూత్న ప్రయోగం. భూత, భవిష్యత్, వర్తమానాల్ని సింగీతం చూపించిన విధానం అబ్బుర పరిచింది. అలాంటి సినిమా మరోసారి తీయాలని చాలా మంది ప్రయత్నించారు. కానీ… ఎవ్వరూ సక్సెస్ కాలేదు. సీక్వెల్‌గా `ఆదిత్య 999` చేయాలని బాలయ్య – సింగీతం కూడా అనుకున్నారు. కానీ అదీ వర్కవుట్ అవ్వలేదు. కానీ… ఈ ఫార్ములాని సందీప్‌కిషన్ వాడేశాడు. తన కొత్త సినిమా `నిను వీడని నీడను నేనే`లో.
ఇది కూడా భూత – భవిష్యత్ – వర్తమానాల కాన్సెప్ట్ ప్రకారమే సాగబోతోంది. రాగల 20 ఏళ్లలో ఎలాంటి సాంకేతిక మార్పులొస్తాయి? సమాజం, మనుషులు ఎలా మారిపోతారు అనే విషయాన్ని ఇందులో చూపిస్తున్నారు. సినిమా మొదలైన పది నిమిషాలకే ఫ్యూచర్లోకి తీసుకెళ్లబోతున్నారు. ఆ సన్నివేశాల కోసం విజువల్ ఎఫెక్ట్స్ అవసరం ఏర్పడింది. చిత్ర దర్శకుడికి ఇది వరకే విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో నైపుణ్యం ఉంది. అందుకే ఆ సీన్స్ అన్నీ బాగా వచ్చాయని టాక్. 20 ఏళ్ల ముందుకే కాదు, 20 ఏళ్ల వెనక్కి కూడా తీసుకెళ్లబోతోంది చిత్రబృందం. ఈ కథలోనే హారర్, ఫాంటసీ అంశాలు మిక్స్ చేశారు. ఈ సినిమాలో చాలా రకాలైన జోనర్లున్నాయని సందీప్ ముందునుంచీ చెబుతూనే ఉన్నాడు. ఇన్నిరకాల ప్యాకేజీలు కలగలిపి సందీప్‌కి హిట్టు తీసుకొస్తాయేమో చూడాలి.
https://www.youtube.com/watch?v=xnlo5JkQDqU