యువ హీరోలంతా నిర్మాణ రంగంపై దృష్టి పెడుతున్నారు. తమ సినిమాల్లో తామే హీరోలుగా నటించేయకుండా, మిగిలిన వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. నాని సినిమాలో నాని హీరో కాడు. విజయ్ దేవరకొండ కూడా తన స్నేహితుడైన తరుణ్ భాస్కర్ని హీరోగా చేశాడు. ఇప్పుడు సందీప్ కిషన్ కూడా అదే పనిచేస్తున్నాడు.
సందీప్ కిషన్ నిర్మాతగా `నిను వీడని నీడను నేనే` చేశాడు. అందులో తానే హీరో. ఇప్పుడు మరో సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. ఈసారి మాత్రం తాను కేవలం నిర్మాత పాత్రకే పరిమితం అవ్వాలనుకుంటున్నాడు. హీరోలుగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శన్లు నటిస్తారు. స్క్రిప్టు సిద్ధమవుతోంది. దర్శకుడు ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఈ కథలో గమ్మత్తేమిటంటే.. కామెడీ కంటే, యాక్షన్ ఎక్కువగా ఉంటుందట. ఇప్పటి వరకూ రాహుల్, ప్రియదర్శిలను కమెడియన్లుగానే చూశాం. ఇప్పుడు యాక్షన్ హీరోలుగా అవతరించబోతున్నారన్నమాట. అదెలా ఉంటుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.