వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలంటూ గతంలో.. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు.. చేసిన ప్రయత్నాలను… వైఎస్ వివేకా కుమార్తె సునీత వ్యతిరేకిస్తున్నారు. తన పిటిషన్ వెనక్కి తీసుకుంటానంటూ.. జగన్ వేసిన పిటిషన్పై.. సునీత తరపు లాయర్..కోర్టులో వ్యతిరేకించారు. దాంతో.. న్యాయమూర్తి.. ఎందుకు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారో చెప్పాలంటూ… ప్రభుత్వం తరపు న్యాయవాదుల్ని ఆదేశించింది.
వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కారణాలు ఏమైనా కానీ.. జగన్.. కేసు విచారణను సీబీఐకి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. హైకోర్టులో స్వయంగా పిటిషన్ వేశారు. నిజానికి ఇలాంటి పిటిషన్లు..ఆయన భార్య, పిల్లలు మాత్రమే వేయడానికి అవకాశం ఉంది. అయితే.. సమీప బంధువుగా చెబుతూ జగన్ కూడా… విడిగా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై వాదనల్లో అప్పట్లో.. విచారణ వివరాలు బయటకు చెప్పవద్దని హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. ఆ తర్వాత జగన్ అధికారంలోకి రావడంత.. కేసు విచారణ నెమ్మదించడం.. వరుసగా… విచారణాధికారుల్ని మార్చడంతో… కేసు దాదాపుగా కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిందన్న అభిప్రాయం ఏర్పడింది.
ఈ క్రమంలో.. వైఎస్ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో సీబీఐ విచారణకు పిటిషన్ వేయడం.. సంచలనం సృష్టించింది. స్వయంగా సీబీఐ విచారణ కోరుతూ.. ముఖ్యమంత్రి జగన్ పిటిషన్ కూడా… పెండింగ్లో ఉన్న విషయాన్ని.. సునీత తన అఫిడవిట్లో గుర్తు చేశారు. దీంతో ఉలిక్కిపడటం… జగన్ లాయర్ల వంతు అయింది. సీఎం హోదాలో ఉన్న వ్యక్తే.. సీబీఐ విచారణ కోరుతూండగా.. ప్రభుత్వ లాయర్లు మాత్రం భిన్నమైన వాదన వినిపించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న వస్తుందన్న ఆలోచన రావడంతోనే.. పిటిషన్ ఉపసంహరణకు ప్రయత్నాలు చేశారు. కానీ సునీత లాయర్లు అడ్డు చెప్పారు. ఇప్పుడు.. పిటిషన్ ఉపసంహరణకు.. కారణాలను..జగన్ చెప్పాల్సి ఉంది.