సినిమాలపై వచ్చే సినిమాలు చూస్తేనే ఉన్నాం. వాటిలో సినిమా వాళ్ల కష్టాలే ఎక్కువగా చూపిస్తుంటారు.ఇంకొన్ని సెటైరికల్ మూవీస్ ఉంటాయి. అయితే ఈమధ్య సినిమా వాళ్లు.. తమపై తాము సెటైర్ వేసుకోవడం బాగా తగ్గించేశారు. చాలా కాలం తరవాత.. అలాంటి సినిమా ఒకటి వస్తోంది. అదే.. ‘భువన విజయం’. సునీల్ ఈ చిత్రంలో హీరో! ఓ సినిమా చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులో సినిమాల కథలపై, హీరోలపై, దర్శకుల యాటిట్యూడ్‌పై, హీరోయిన్ల ఓవర్ యాక్షన్‌పై బోలెడన్ని సెటైర్లు పడ్డాయట. అవన్నీ హిలేరియస్‌గా ఉండబోతున్నాయని టాక్. ఓ హీరోని `సెంటర్` చేసి ఆడుకోనే సీన్… ఈ సినిమాలో హైలెట్ అవ్వబోతోందట. ఆ హీరో ఎవరన్నది తెరపై చూస్తే గానీ తెలీదు. ‘బర్త్ ఆఫ్ భువన విజయం’ పేరుతో ఓ ప్రోమో విడుదల చేసింది టీమ్. అది చూస్తే… ఈ సినిమాలో సినిమాలపై ఎన్ని సెటైర్లు ఉన్నాయో అర్థం అవుతుంది. కాకపోతే అది కాంట్రవర్సీ అవుతుందో, కామెడీగా లైట్ తీసుకొంటారో చూడాలి. ఇది వరకు ‘కథ, స్క్రీన్ ప్లే, అప్పల్రాజు’తో కూడా సునీల్ ఇలాంటి ప్రయత్నమే చేశాడు. కానీ అందులో ఫన్ కంటే వర్మ తాలుకూ పైత్యమే ఎక్కువ కనిపిస్తుంది.
‘భువన విజయం’ అనే ఓ మంచి టైటిల్ దొరకడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఇండస్ట్రీలో ఉన్న హాస్య నటులంతా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఈమధ్య సునీల్ సుడి బాగుంది. పుష్ప లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించే ఛాన్స్ అందుకొన్నాడు. కాకపోతే… హీరోగా తను బ్యాడ్ ఫేస్ లో ఉన్నాడు. సోలోగా ఓ హిట్టు కొట్టి చాలాకాలమైంది. కనీసం ఈసారైనా ఆ లోటు తీరుతుందో, లేదో?