ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న ‘అరవింద సమేత… వీరరాఘవ’ చిత్రానికి, మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘అతడు’ చిత్రానికి రెండు కనెక్షన్స్ వున్నాయి. అవేంటో తెలుసా? రెండు చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడనే విషయాన్ని అందరూ సులభంగా చెప్పేస్తారు. ఇంకొకటి… ‘అతడు’లో కమెడియన్‌గా నటించిన సునీల్ ఈ ‘అరవింద సమేత…’లోనూ కమెడియన్‌గా నటిస్తున్నాడు. అంతే కాదు… ఎన్టీఆర్ సినిమాలో అతడి పాత్ర అచ్చంగా ‘అతడు’లో వున్నట్టు వుంటుందని చెప్పాడు. సునీల్ ప్రధాన పాత్రలో నటించిన ‘సిల్లీ ఫెలోస్’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు. అప్పుడు ‘అరవింద సమేత వీరరాఘవ’లో మీ పాత్ర ఎలా వుంటుంది? అని అడిగితే… ‘‘నా స్నేహితుల్లో ఇద్దరు ముగ్గురు నన్ను ఇదే ప్రశ్న అడిగారు. సింపుల్‌గా చెప్పాలంటే ‘అతడు’లో నా పాత్ర ఎలా వుంటుందో? ఆ తరహాలో వుంటుంది. ఆ తరహా వినోదం పంచుతుంది’’ అని సునీల్ చెప్పాడు. ‘సిల్లీ ఫెల్లోస్’లో క్యారెక్టర్ ‘సొంతం’, ‘ఆడుతూ పాడుతూ’ సినిమాల్లో అతడి క్యారెక్టర్ తరహాలో లౌడ్‌గా వుంటుందట! ప్రేక్షకులు లాజిక్కుల గురించి ఆలోచించకుండా సినిమా చూస్తే… కామెడీ మేజిక్‌ని ఎంజాయ్ చేయవచ్చని చెబుతున్నాడు!!