ఏపీ బీజేపీ ఇంచార్జ్ గా ఉంటూ వైసీపీ కోసం ఎక్కువగా పని చేస్తారనే ప్రచారం ఉన్న సునీల్ ధియోధర్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఇటీవల సోము వీర్రాజును ఫోన్ చేసి పదవి నుంచి పీకేసినట్లే.. ఈ సారి ధియోధర్ కు కూడా ఏమీ చెప్పకుండానే తీసేశారు. ఆయనకు ఉన్న జాతీయకార్యదర్శి పదవిని తీసేయడంతో ఆటోమేటిక్ గా ఏపీ వ్యవహారాల కో ఇంచార్జ్ పదవి కూడా పోయినట్లయింది.
సాధాణంగా జాతీయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శులకే రాష్ట్రాల బాధ్యతలు ఇస్తారు. ఏపీ బీజేపీ పూర్తి స్థాయి ఇంచార్జ్ గా మురళీధరన్ ఉంటారు. ఆయన చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే రాష్ట్రానికి వస్తారు. ఆయన కేంద్ర మంత్రి కూడా. కో ఇంచార్జ్ గా ఉన్న సునీల్ ధియోధర్ దే కీలకం. ఆయన వైసీపీతో కుమ్మక్కయి… మొదటి నుంచి టీడీపీనే టార్గెట్ చేశారు. ఇటీవల పురందేశ్వరి ప్రమాణస్వీకారంలోనూ అదే చేశారు. దీంతో ఆయనకు గుడ్ బై చెప్పేశారు.
రెండు, మూడు రోజుల్లో కొత్త బీజేపీ ఇంచార్జ్ ను.. కో ఇంచార్డ్ ను ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీకి దగ్గరగా ఉన్న వారందర్నీ వ్యూహాత్మకంగా తప్పిస్తూండటంపై బీజేపీలోనూ చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ తో పొత్తులను పేరకే కాకుండా కనీసం ఎన్నికల వరకూ తెచ్చుకోవాలన్న లక్ష్యంతో కొత్తగా ఈ పనులు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు . త్వరలో పార్టీ కార్యవర్గాన్ని మార్చాలని పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారు.