సునీల్ అనగానే భీమవరం యాసలో కామెడీతో కడుపుబ్బా నవ్వించే కమెడియన్ గుర్తుకు వస్తాడు. అయితే కొంచం క్రేజ్ వచ్చే సరికి తను సోలో హీరోగా చేసినా ప్రేక్షకులు ఆమోదిస్తారనే భరోసాతో హీరోగా మారాడు. అయితే తాను హీరోగా మారింది తన కోసం కాదని.. స్టార్ హీరోల సినిమాల్లో నటించేప్పుడు దర్శక నిర్మాతల వల్ల ఇబ్బంది ఫీల్ అయ్యే హీరోగా మారానని కటింగ్స్ ఇచ్చినా సునీల్ ఇప్పుడు హీరో.. అయితే కమెడియన్ గా ఎంత హిట్ అయ్యాడో హీరోగా అంత ఫ్లాప్ అవుతున్నాడు.
తీస్తున్న సినిమాలన్ని అపజయాల బాట పట్టడంతో రెండేళ్లు గ్యాప్ తీసుకుని మరి కృష్ణాష్టమి తీశాడు సునీల్. దిల్ రాజు నిర్మాణంలో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టే. అందులోనే దిల్ రాజు ఊరకనే సినిమాలు తీసేయడు. మరి అలాంటి శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ టీం అంతా కలిసి రెడీ చేసిన సినిమా కథ ఇలా కలగూరలా ఉందే అన్న డౌట్ వారికి రాలేదు అనుకుంటా.. కాస్త కూస్తో సునీల్ కు డౌట్ వచ్చినా దిల్ రాజు మీద ఉన్న నమ్మకంతో పాత కథ అయినా స్పెషల్ ట్రీట్ మెంట్ ఇప్పిస్తాడనుకున్నారు.
తీరా వాసు వర్మ తీసిన కృష్ణాష్టమి చూస్తే సునీల్ అసలు హీరోగా ఎందుకు మారాడు అన్న డౌట్ కూడా వస్తుంది. తన కెరియర్ లో ఎలాంటి సినిమాలు చేయాలి అనే నిర్ణయాలను తెలివిగా తీసుకోగలిగిన వాడే హీరోగా నిలబడగలుగుతాడు. అయితే సునీల్ దానిలో చాలా వెనుకబడి ఉన్నాడని చెప్పాలి అందునా సునీల్ కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మరి ఇప్పటికైనా సునీల్ ఆలోచించి సినిమాలు చేస్తే బెటర్ లేదంటే అసలకే మోసం వచ్చే పరిస్థితి ఎదురవుతుంది.