ప్రముఖ హాస్య నటుడు సునీల్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గొంతు నొప్పితో సునీల్ బాధ పడుతున్నారని, నీరసంగా కూడా ఉన్నారని, అందుకే చికిత్స తీసుకుంటున్నారని సునీల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈరోజే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అవుతారని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన అల వైకుంఠపురములో లో సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించారు. శుక్రవారం విడుదల కానున్న డిస్కోరాజాలోనూ సునీల్ నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో తీరిక లేకుండా గడపడం వల్ల సునీల్ అశ్వస్థతకు లోనయ్యారని సమాచారం. శుక్రవారం ఆయన ఓ కొత్త సినిమా షూటింగులోనూ పాలు పంచుకోవాల్సివుంది.