ఎవరైనా ఏదైనా వస్తువులు దాచి పెట్టాలని అనుకున్నారంటే… అది ఖచ్చితంగా అనుమానాస్పదం అయిందే అయి ఉంటుందనేది పోలీసులకు నేర్పే ప్రాధమిక పాఠాల్లో ఒకటి. ఇది ఐపీఎస్లకు తెలీదని అనుకోవడానికి లేదు. తెలుసు.. మరి ఐపీఎస్లకే అలాంటి పరిస్థితి వస్తే ఎలా స్పందిస్తారు..?. సాధారణమైన వ్యక్తుల్లానే ప్రవర్తిస్తారని.. ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ నిరూపించారు. ఆయన హిందూమతానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల వీడియోలను… తన క్రిస్టియానిటీ గురించి చెప్పిన వీడియోలను… సోషల్ మీడియా నుంచి హఠాత్తుగా డిలీట్ చేశారు. దీంతో ఆయన తప్పు చేశారన్న ప్రచారం నిజమైందని.. సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది.
ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ మతం మారి రిజర్వేషన్లు పొందుతున్నారని.. హిందూ మతం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని.. లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్ఐ జోషి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఇలా ఫిర్యాదు చేసినట్లుగా తెలియగానే.. అలా సీఐడీ చీఫ్ హోదాలో ఉన్న సునీల్ కుమార్.. వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించేలా చేసుకున్నారు. దీనిపై లీగల్ రైట్స్ అడ్వైజరీ స్పందించింది. ఈ వీడియోలను తొలగించడం అంటే.. తప్పు చేసినట్లుగా అంగీకరించడమేనని.. తాము డౌన్ చేసిన వీడియోల కాపీలను హోంమంత్రిత్వ శాఖకు సమర్పించామని తెలిపింది.
పీవీ సునీల్ కుమార్ క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు. క్రిస్టియానిజాన్ని భారత్కు అందించిన బ్రిటిష్ వారిని వేనోళ్ల పొగుడుతూ క్రిస్తును ఎంతో స్తుతిస్తూ.. హిందూమతంపై నిందలు వేస్తూ.. ఆయన ప్రసంగాలు చేసిన నీడియోలు సోషల్ మీడియాలో వైరల్గానే ఉన్నాయి. ఆయన అలా డిలీట్ చేసిన విషయం తెలియగానే.. ఎలా పెద్ద ఎత్తున ఆ వీడియోలను ఇతరులు అప్ లోడ్ చేయడం ప్రారంభించారు. దీంతో సీఐడీ సునీల్ పరిస్థితి మరోరకంగా తయారైంది. సోషల్ మీడియాలో తాను పెట్టిన వీడియోలను డిలీట్ చేస్తే తప్పు చేసినట్లుగా ఒప్పుకున్నట్లు అవుతుంది కానీ ఆ వీడియోలను లేకుండా చేయడం సాధ్యం కాదని ఆయన గుర్తించలేకపోయారు. ఐపీఎస్.. పోలీసు శాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా కాకుండా సాధారణ వ్యక్తిగానే ఆలోచించారు.