`మర్యాద రామన్న` అనగానే సునీల్ గుర్తొస్తాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం.. సునీల్ కెరీర్ లో మర్చిపోలేని సినిమాగా మిగిలిపోయింది. ఇప్పుడు మరోసారి సునీల్ `మర్యాద..` చేయబోతున్నాడు. అదేనండీ.. ఆ టైటిల్ గుర్తుచేయబోతున్నాడు. సునీల్ – వి.ఎన్.ఆదిత్య కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. దీనికి `మర్యాద కృష్ణయ్య` అనే పేరు ఖరారు చేశారు. ఈరోజు సునీల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్‌ని, టైటిల్ నీరివీల్ చేశారు. ఏటీవీ ఒరిజినల్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. లక్ష్మీ భూపాల మాటలు అందిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి. మరి అప్పటి మర్యాద రామన్నకీ, ఇప్పటి మర్యాద కృష్ణయ్యకీ సంబంధం ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.