ఫ్లాపు మీద ఫ్లాపు పడి అల్లాడిపోతున్నాడు సునీల్. ఏ సినిమాపై హోప్స్ పెట్టుకొన్నా… ఫ్లప్ తప్ప ఇంకోటి దక్కడం లేదు. సినిమా సినిమాకీ సునీల్ మార్కెట్ ఢమాలున పడిపోతోంది. అందుకే ఇకపై రిస్క్ లేని ప్రయాణం చేయడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చాడు సునీల్. ఇక్కడి కథలకంటే.. పరాయి కథల్ని రీమేక్ చేసుకోవడం సౌలభ్యం అనుకొంటున్నాడు. అందుకే రీమేక్‌పై ఫోకస్ చేశాడు. మలయాళ చిత్రం టూ కంట్రీస్ ని సునీల్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కథపై సునీల్దృష్టి పడింది. తమిళంలో జివి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన సినిమా…ఇనక్కు ఇన్నో పేర్ ఇరుక్కు. శ్యాం ఆంటోనీ దర్శకుడు. ఈ సినిమాని ఇప్పుడు సునీల్ తెలుగులో రీమేక్ చేద్దామనుకొంటున్నాడని టాక్. నిజానికి తమిళంలో ఈ సినిమా ఆడింది లేదు. కానీ ఫ్లాట్ మాత్రం కామెడీ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. తెలుగులో ఈ సినిమాని డబ్ చేశారు కూడా… నాకు ఇంకో పేరు ఉంది.. అనే పేరుతో. కానీ జీవీకి తెలుగులో మార్కెట్ లేకపోవడం, తమిళంలో ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో డబ్బింగ్ సినిమాని ఇంకా విడుదల చేయలేదు. దాంతో.. సునీల్ ఈ సినిమాని రీమేక్ చేసుకోవడానికి మార్గం సుగమం అయ్యింది. జి. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. తమిళంలో ఈ సినిమాని తెరకెక్కించిన నిర్మాతలే తెలుగులోనూ రీమేక్ చేస్తారట. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.