పూరి జగన్నాధ్ లేటెస్ట్ చిత్రం రోగ్. నిర్మాత సిఆర్ రామచంద్రన్ తనయుడు ఇషాన్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఎప్పుడో మొదలైనా ఈ చిత్రం షూటింగ్ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. అయితే అంతా కొత్త వాళ్ళే కావడంతో ఈ సినిమాపై బజ్ క్రియేట్ కావడంలో లేదు. ఈ సినిమాకి వున్న ఎకైక ఎట్రాక్షన్ పూరి జగన్నాధ్ పేరు మాత్రమే.
అయితే ఇప్పుడు ఏదోలా ఈ సినిమాని ఎత్తాలని ప్లాన్ చేస్తున్నాడు పూరి. ముందుగా చెప్పుకునట్లే ఈ సినిమా ఆడియో వేడుకకు మాజీ నీలి చిత్రాల సుందరి, ప్రస్తుతం బాలీవుడ్ ఐటెం గర్ల్ సన్నీలియోన్ ను దించాడు. ఈ ఆడియో వేడుకలో సన్నీ డ్యాన్స్ చేయడం కూడా జరిగిపోయింది. ఒక టాలీవుడ్ సినిమా ఆడియో ఫంక్షన్ లో సన్నీ లియోన్ డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి.
అయితే సన్నీ లియోన్ లైవ్ డ్యాన్స్ రోగ్ సినిమాకి ఎంత వరకూ హెల్ప్ అవుతుందన్నది ఇక్కడ ప్రశ్న. యుట్యూబ్ కాలమిది. సన్నీ లియోన్ లైవ్ డ్యాన్స్ అని టైపు చేస్తే వందల వీడియోలు వస్తాయి. సో.. లైవ్ డ్యాన్స్ లు వెరీ కామన్. అవి సినిమాకి హెల్ప్ అవుతాయనేది భ్రమే. దానికి బదులు సినిమాలోనే సన్నీలియోన్ తో ఓ పాట చేయించాల్సింది. కనీసం మంచు మనోజ్ కరెంట్ తీగకు వచ్చిన బజ్ అయినా క్రియేట్ అయ్యిండేది.