బూతు సుందరి, పోర్న్ స్టార్… ఈ ట్యాగులతోనే బాలీవుడ్‌ని దడదడలాడించేసింది సన్నీలియోన్. బోల్డ్ సీన్స్ బోల్డన్ని చేసేసి.. ఆ విషయంలో తనని బీట్ చేసేవాళ్లే లేరని నిరూపించుకొంది. సన్నీ సినిమా వస్తోందంటే ఆడియన్స్.. అందునా కుర్రకారు ఎగబడతారు. బీసీల్లో.. సన్నీ రేంజు వేరుగా ఉంటుంది. సన్నీ చిన్న బిట్ చేసినా.. ఆ సినిమాకి కలక్షన్ల వర్షం కురుస్తుంది. అందుకే నిర్మాతలు కూడా సన్నీ వెంట పడుతున్నారు. భారీ పారితోషికం ఇచ్చి తమ సినిమాల్లో ఒక్క సీన్ అయినా చేయమని బతిమాలుతున్నారు. అయితే సన్నీ ఇప్పుడో సంచలన నిర్ణయం తీసుకొంది. అదేంటంటే ఇక ముందు బూతు సీన్లలో నటించదట. కనీసం ముద్దు సన్నివేశాలూ ఒప్పుకోదట. ఈ మాట విని.. దర్శక నిర్మాతలు షాకైపోతున్నారు.
పోర్న్ స్టార్‌గా తనమీద ఉన్న ముద్రని చెరిపేసుకోవాలని చూస్తోంది సన్నీలియోన్. ఎంతకాలం ఇలాంటి సన్నివేశాలతో పేరు తెచ్చుకొంటాం??? అంటూ మాట్లాడుతోందట. ఇంటిల్లిపాదీ చూసే సినిమాల్లో నటించాలని ఉందని, తనలోని బూతుని మాత్రమే చూడొద్దని, మంచి నటి ఉన్న విషయం గమనించమని అడుగుతోందట. మేకప్ లేని పాత్రలు, సెంటిమెంట్ నిండిన సీన్లు ఉంటే చెప్పమంటోందట. సన్నీకి ఈ జ్ఞానోదయం ఎప్పుడు కలిగిందా అని నిర్మాతలు నివ్వెరపోతున్నారు. మరి సన్నిలో ఈ యాంగిల్‌ని తట్టిలేపేదెవరో..??