‘రాజశేఖరా… నీపై మోజు తీరలేదురా’ అన్నట్టు సన్నీ లియోన్‌తో సినిమాలు తీయాలని ప్రయత్నించే దక్షిణాది దర్శక నిర్మాతలకు ఆమెపై మోజు తీరినట్టు లేదు. ఒక్కప్పటి ఈ శృంగార తారను భారతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన హిందీ చిత్రపరిశ్రమకు ఆమెపై మోజు ఎప్పుడో తీరింది. రెండేళ్ల నుంచి సన్నీ లియోన్ని మెయిన్ హీరోయిన్గా పెట్టి సినిమాలు తీయడం లేదు. ఓన్లీ ఐటమ్ సాంగులకు పరిమితం చేశారు. రెండు మూడు రోజులు మహా అయితే ఐదు రోజుల్లో ఐటమ్ సాంగులు తీసేస్తారు. సన్నీ డైరీలో బోలెడు డేట్స్ మిగులుతున్నాయి. అదే దక్షిణాది దర్శక నిర్మాతలకు కలిసిచ్చింది. కథలతో సన్నీ ఇంటి దగ్గర క్యూ కడుతున్నారు. రెమ్యునరేషన్ గట్టిగా ఆఫర్ చేసినవాళ్లకు కాదనకుండా డేట్స్ ఇస్తుందామె. ఆల్రెడీ దక్షిణాది భాషల్లో ‘వీరమహాదేవి’ అని ఒక పీరియాడికల్ ఫిల్మ్ చేస్తుంది. తాజాగా మరో సౌత్ సినిమాకి సన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. కన్నడ దర్శకుడు రఘురాజ్ చెప్పిన రివేంజ్ డ్రామాలో నటించడానికి అంగీకరించార్ట. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో మల్కాపురం శివకుమార్ ఈ సినిమాను నిర్మిస్తార్ట.