తెలంగాణ రాజకీయాలలో కేసీఆ ర్ అంటే ఓ బ్రాండ్. ఆయన కేవలం మాటలతోనే మంటలు పుట్టిస్తారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన మాటలే ఫ్యూయల్. ఎప్పటికైనా ఆయనకు కౌంటర్ ఇచ్చేవారు వస్తారా అన్న సందేహాలు ఉండేవి. రేవంత్ రెడ్డి రాకపోతే ..చాలా మంది కేసీఆర్‌కు ధీటైన లీడర్ అనుకున్నారు. ఇప్పుడు ఆయన మరింత రాటుదేలుతున్నారు. ఒక్క కేసీఆర్ కే కాదు.. తన మీదకు ఎంత మంది వచ్చినా వారందరికీ .. తనది శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. పాలన పరంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలున్నా.. రాజకీయంగా మాత్రం రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ తన మాటల ద్వారానే సాధిస్తున్నారు.
ఓటమి తర్వాత బయటకు రాకుండా అప్పుడప్పుడు పార్టీ కార్యకర్తలో. ఫామ్ హౌస్‌లోని గోడౌన్లో సమావేశం ఏర్పాటు ఎవరో రికార్డు చేసే వీడియోలను లీక్ చేస్తున్నారు. అందులోనే కేసీఆర్ కాస్త తనదైన శైలిలో మాటల్ని .. బీఆర్ఎస్ కు హైప్ ఇచ్చేందుకు కొన్ని డైలాగుల్ని వాడుతున్నారు. శుక్రవారం ఆయన గట్టిగా కొడుతాం అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. దీంతో రేవంత్ కౌంటర్ ఇచ్చారు. సరిగ్గా నిలబడే పరిస్థితే లేదని గట్టిగా కొడతావా అని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటకు రేవంత్ .. అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడేటప్పుడు మధ్యలో ఆయన అనే మాటలకు అందరూ నవ్వేవారు. ఇప్పుడు రేవంత్ ఇస్తున్న కౌంటర్లకు నవ్వుతున్నారు.
ఒక్క కేసీఆర్ కు కాదు.. బండి సంజయ్ కు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. గద్దర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఎక్కువ మాట్లాడితే బీజేపీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతామని.. పద్మ అవార్డుల్ని ఎలా ఇప్పించుకోవాలో తమకు తెలుసని రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మామూలుగా ఎదురు విమర్శలు చేయడం కాదు.. వారికి గుక్కతిప్పుకోలేని కౌంటర్ ఇవ్వడంలో రేవంత్ తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు.
పాలన విషయంలో రేవంత్ పై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటూ ఎన్నికల హామీలను నెరవేర్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయినా రాజకీయంగా మాత్రం.. ఆ ఒత్తిడి కనిపించనీయడం లేదు. ఉల్లాసంగా.. ఉత్సాహంగా అందర్నీ సింపుల్ గా ఒంటిచేత్తో ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు.