సూపర్‌స్టార్ కృష్ణ అంతిమ సంస్కారాలు మహా ప్రస్థానంలో ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. బుధవారం ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణ అభిమానులు పద్మాలయ స్టూడియోకు చేరుకుని కృష్ణ పార్థివదేహం వద్ద పుష్పాంజలి ఘటించారు.
అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య పద్మాలయ స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకూ కృష్ణ అంతిమయాత్ర సాగింది. కృష్ణను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు మహాప్రస్థానం రహదారికి ఇరువైపులా భారీగా చేరుకున్నారు. తమ అభిమాన హీరోని కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చి అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు.