త్రివిక్రమ్ సినిమా అంటే బాక్సాఫీసు దగ్గర వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఏ, బీ, సీ అనే తేడా లేదు.. అన్ని చోట్లా త్రివిక్రమ్‌కి అభిమానులున్నారు. అ.ఆ వసూళ్ల ప్రపంభనం చూస్తే త్రివిక్రమ్ స్టామినా ఏమిటో అర్థమవుతుంది. ఈ సినిమాకి తొలి రోజు… ఏకంగా 6.7 కోట్ల వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు లెక్కగట్టాయి. ఓవర్సీస్లోనే 1.6 కోట్లు కొల్లకొట్టిందీ చిత్రం. నితిన్ కెరీర్లో ఇదే రికార్డ్. శని, ఆది వారాల టికెట్లు అప్పుడే బుక్ అయిపోయాయి. ఓ వారం వరకూ మల్టీప్లెక్స్‌లో టికెట్ దొరికే పరిస్థితి లేదు. ఫ్యామిలీ మూవీ కావడంతో తొలి వారంలోనే ఈసినిమా బ్రేక్ ఈవెన్‌లో పడిపోతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. నైజాంలో రూ.2.3 కోట్లు రాబట్టిన అ.ఆ… సీడెడ్‌లో కోటి రూపాయలకు దగ్గర పడింది. సమ్మర్ సీజన్.. పైగా ఫ్యామిలీ సినిమా, సమంత.. అన్నింటికీ మించి త్రివిక్రమ్ బ్రాండ్ ఈ సినిమాకి బాగా కలిసొచ్చే అంశాలు. వాటికి తోడు పవన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని తమ హీరో సినిమాగానే అనుకొని భుజాలనెత్తుకొన్నారు. ఇంకేముంది… అ.ఆ ఇలానే అదిరిపోవాల్సిందే.