కృష్ణ కుమార్తె మంజుల తెలుసు కదా? షో సినిమాతో నటిగా నిర్మాతగా తెరపైకొచ్చింది. ఆ తరవాత ఒకట్రెండు సినిమాల్లో కనిపించింది. ఆమె.. స్ర్కీన్‌పై కనిపించి చాలా కాలమైంది. ఇప్పుడు మళ్లీ ఓ సినిమా చేయబోతోంది. ఈసారి నటిగా, నిర్మాతగా కాదు. దర్శకురాలిగా. ఔను.. మంజుల మెగా ఫోన్పట్టబోతోంది. అందుకు తగిన కథ కూడా సిద్ధం చేసుకొంది. ఇందులో కథానాయకుడిగా నాని నటిస్తాడని సమాచారం. ఆనంది ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
తెలుగులో దర్శకురాళ్ల సంఖ్య చాలా తక్కువ. విజయ నిర్మల, జీవిత.. ఇప్పుడు బి.జయ, నందినిరెడ్డి ఇలా నలుగురైదుగురు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మంజుల రాకతో ఆ సంఖ్య ఇంకాస్త స్ట్రాంగ్ అవ్వనుంది. ఇటీవల నానిని కలిసిన మంజుల స్టోరీ నేరేట్ చేసిందట. నానికి విపరీతంగా నచ్చడంతో ఈసినిమా ఓకే అయిపోయింది. నానితో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో జెమిని కిరణ్ వెయిటింగ్. అలా ఈ ప్రాజెక్టు సెట్టయిపోయింది.