సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ప్రస్తుతం ఆయన కండీషన్ సీరియస్ గా వుంది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
‘‘కృష్ణ గారికి . కార్డియాక్ అరెస్ట్ పరిస్థితి ఉండటంతో వెంటనే ఎమర్జెన్సీకి తరలించి సీపీఆర్ చేశాం. సీపీఆర్ తర్వాత కార్డియాక్ అరెస్ట్ నుంచి ఆయన బయటకొచ్చారు. అనంతరం ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం అందిస్తున్నాం. మరో 48 గంటల వరకు కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేం’’ అని వైద్యుల బృందం వెల్లడించింది.