సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యం పాలయ్యారు. హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరారు. గత కొంతకాలంగా వయసురిత్యా వచ్చే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కృష్ణ. గతంలో కూడా ఆయన ఆరోగ్యం కొన్ని వార్తలు వచ్చాయి. కోవిడ్ సమయంలో ఆయన ఆరోగ్యం దెబ్బతినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ పరిస్థితుల నుండి క్షేమంగా బయటపడ్డారు కృష్ణ. తాజాగా ఆయన మరోసారి అనారోగ్యం పాలయ్యారు. కాంటినెంటల్ హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన అనారోగ్యం సంబధించిన మరిన్ని వివరాలు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాల్సివుంది.