ఈరోజు సాయిధరమ్ తేజ్ సినిమా సుప్రీమ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకొంది. సాయి రేంజుకి… ఈ టాక్ సరిపోతుంది. కానీ ఆ సినిమాపై ఖర్చు పెట్టిన బడ్జెట్‌కి మాత్రం సరిపోదు. ఎందుకంటే రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. సాయి ధరమ్ స్టామినాకు ఎక్కువే. దానికి తోడు బిజినెస్ మొత్తం కలుపుకొంటే రూ.24 కోట్ల వరకూ చేసింది. టేబుల్ ప్రాఫిట్‌తో దిల్‌రాజు గట్టెక్కేశాడు. అయితే బయ్యర్ల మాటేంటో తెలాల్సివుంది. శుక్రవారం 24 విడుదల అవుతోంది. సూర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. సూర్య హవా బీ, సీ సెంటర్లలో బాగా నడుస్తుంది. విక్రమ్ కె.కుమార్‌కి మల్టీప్లెక్స్‌లో డిమాండ్ ఉంది. సో.. రెండు చోట్లా ఈసినిమా కుమ్మేయడం ఖాయం.
ఆల్రెడీ మల్టీప్లెక్స్‌లలో బుకింగ్‌లు షురూ అయిపోయాయి. టికెట్లూ జోరుగా అమ్ముడు పోతున్నాయి. 24కి హిట్ టాక్ వస్తే… సుప్రీమ్ వసూళ్లు డౌన్ అవుతాయి. అంటే.. ఇప్పుడు మెగా భవితవ్యం.. సూర్య సినిమాపై ఆధారపడి ఉందన్నమాట. మరోవైపు తరణ్ ఆదర్శ్.. 24 సినిమా అదిరిపోయిందంటూ ట్వీట్లమీద ట్వీట్లు చేస్తున్నాడు. ఇలాంటి పాజిటీవ్ బజ్.. 24కి బాగా హెల్ప్ చేసే అవకాశం ఉంది. సుప్రీమ్ బాక్సాఫీసు దగ్గర నిలబడతాడా, లేదా అన్నది తేలాలంటే మరికొద్ది గంటలు ఆగితే సరిపోతుంది.