మీడియా స్వేచ్చను హరించేలా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన.. విమర్శించిన జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు పెట్టడంపై చర్చ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు మరో సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువాపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన రాజద్రోహం కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. లాక్డౌన్కు వ్యతిరేకంగా వినోద్ దువా.. మాట్లాడారన్న కారణంగా ఈ కేసును హిమాచల్ ప్రదేశ్ సర్కార్ నమోదు చేసింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేదారనాథ్ తీర్పు ప్రకారం.0 జర్నలిస్టులకు రాజద్రోహం కేసు నుంచి రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విమర్శించడం, తీవ్రాతి తీవ్రంగా విమర్శించడం జర్నలిస్టుల హక్కుని.. దేశద్రోహం కేసులతో జర్నలిస్టుల స్వేచ్ఛను హరించలేరని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
మీడియాపై దేశద్రోహ కేసులు మోపడం రాష్ట్రాలకు ఫ్యాషనైపోయిందిని.. మీ రాజకీయ సిద్ధాంతాలతో మీడియా విభేదిస్తే దేశద్రోహమా అని ధర్మాసనం ప్రశ్నించింది. జర్నలిజం అసలు ప్రొఫెషనే కాదని వాదించిన హిమాచల్ ప్రభుత్వానికి సుప్రీం అక్షింతలు వేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో.. జర్నలిస్టులపై పెట్టిన రాజద్రోహం కేసులన్నీ.. వీగిపోయినట్లుగానే భావిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు.. ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టినందుకు.. రాజకీయ నేతలు మాట్లాడితే.. ప్రసారం చేసినందుకు కూడా… రాజద్రోహం కేసులు పెట్టే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది.
2014 తర్వాతే అత్యధికంగా 94 శాతం రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల పేరుతో అనేక మందిని అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టారు. ఇ్పపుడు.. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు కారణంగా అవన్నీ తేలిపోనున్నాయి. మీడియా స్వేచ్చను హరించి.. తమకు వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు రాకుండా చేసుకోవాలనుకున్న పాలకులకు గట్ిట దెబ్బ తగిలినట్లయింది.