పద్మశ్రీ అవార్డుని కేంద్ర ప్రభుత్వం కదా ఇచ్చేది…?మరి సుప్రీం కోర్టు మోహన్ బాబుకి పద్మశ్రీ ఖరారు చేయడం ఏమిటి? అని కన్ఫ్యూజ్ అయిపోవద్దు. ఇదివరకు మోహన్ బాబు నటించిన “దేనికయినా రెడీ” సినిమాలో టైటిల్స్ లో మోహన్ బాబు పేరు ముందు పద్మశ్రీ వేసుకొని ఆ బిరుదుని దుర్వినియోగం చేశారని హైకోర్టులో ఒక పిటిషన్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఆ పద్మశ్రీని ఇంట్లోనే పెట్టుకోమని అప్పుడు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దానిపై సుప్రీంకోర్టుకి వెళ్ళిన మోహన్ బాబు పద్మశ్రీని ఇకపై దుర్వినియోగం చేయబోనని హామీ ఇవ్వడంతో ఇదివరకు హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టి సుప్రీంకోర్టు ఆయనకి మళ్ళీ పద్మశ్రీని ఖరారు చేసిందీ రోజు. ఆయనకి పద్మశ్రీ బిరుదు యధాతధంగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మోహన్ బాబు సినిమాలా ద్వారా సంపాదించుకొన్న పద్మశ్రీని తన సినిమాలోనే పోగొట్టుకొని మళ్ళీ సుప్రీంకోర్టులో పొందగలిగారు.