కోల్కతా హత్యచార ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు..మంగళవారం విచారణ జరిపి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంపై మండిపడింది.
ఈ హత్యచార ఘటనను నిరసిస్తూ జరిగిన ఆందోళనలపై బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. శాంతియుతంగా నిరసన చేస్తోన్న వారిపై లాఠీలు ఝులిపిస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తోన్న అంశంపై అధికారం చెలాయించవద్దని సూచించింది. జరుగుతోన్న నేరాలను, శాంతి భద్రతలను రక్షించాల్సింది ప్రభుత్వమేనని సుప్రీంకోర్టు ధర్మాసనం మమతా సర్కార్ కు సూచించింది.
ఈకేసుకు సంబంధించి వైద్యుల భద్రత కోసం పదిమంది ప్రముఖ వైద్యులతో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి పేరు , ఫోటోను మీడియా సంస్థలు ప్రచురించడంపై మండిపడింది.