దారుణమైన హత్య కేసులో దర్యాప్తు అధికారిపై ఆరోపణలు చేస్తూ నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. దర్యాప్తు అధికారిని మార్చే విషయంలో సీబీఐ డైరక్టర్ అభిప్రాయం తెలుసుకుని చెప్పాలని సీబీఐ లాయర్‌ను ఆదేశించింది. అసలేం జరిగిందంటే…కేసు విచారణలో ఆలస్యం చేస్తున్నారని దర్యాప్తు అధికారిని మార్చాలంటూ నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసు విచారణ పురోగతిని సీల్డ్ కవర్లో అందచేయాలని ఆదేశించింది. కేసు విచారణను దర్యాప్తు అధికారి ఎందుకు పూర్తి చేయడం లేదని… వివేకా హత్య కేసు విచారణను త్వరగా ముగించలేకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై సీబీఐ డైరక్టర్ అభిప్రాయం తెలుసుకుని చెప్పారని సీబీఐ తరపు లాయర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
విచారణలో కేసును దర్యాప్తు అధికారి సక్రమంగానే దర్యాప్తు చేస్తున్నారని సీబీఐ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ను టార్గెట్ చేసుకుని వరుసగా పిటిషన్లు వేస్తున్నారు. ఆయనైప కేసులు కూడా పెట్టారు. ఇటీవల హైకోర్టులో కూడా సీబీఐ దర్యాప్తు అధికారి టార్గెట్ గానే పిటిషన్ వేశారు. కేసు వివరాలు సీల్డ్ కవర్లో సమర్పించిన తర్వాత కేసు విచారణలో జోక్యం చేసుకోమనితీర్పు ఇచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు మరోసారి సీల్డ్ కవర్లో వివరాలన్నీ ఇచ్చే అవకాశం ఉంది.
ఓ హైప్రోఫైల్ కేసులో దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసుకుని ఇలా పిటిషన్లు వేయడం.. గతంలో ఎప్పుడూ లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.