లాయర్లకు కోట్లకు కోట్లు చెల్లిస్తున్న ఏపీ ప్రభుత్వం.. పర్యావరణానికి జరుగుతున్న నష్టం విషయంలో మాత్రం ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గతంలో పోలవరంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయన్న కారణంగా ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానా విధించింది.ఈ జరిమానాను చెల్లించకుండా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మానసం.. అసలు లాయర్లకు కోట్లకు కోట్లు చెల్లిస్తున్నారు కదా.. పర్యావరణం విషయంలో మాత్రం ఎందుకు చెల్లించరని ప్రశ్నించింది. పోలవరం విషయంలో లాయర్లకు ఎంత ఖర్చు చేశారన్నది నోటీసు ఇస్తామని సుప్రీం పేర్కొంది.
ఏపీ ప్రభుత్వం చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం.. వాటిని సమర్థించుకోవడానికి కింది స్థాయి నుంచి పై స్తాయి వరకూ కోర్టుల చుట్టూ తిరగడం కామనే. ఢిల్లీలో సిల్లీ కేసులకు గంటల లెక్కన చార్జ్ చేసే లాయర్లను పెట్టుకుని వాదించిన సందర్భాలు ఉ్ననాయి. పోలవరం విషయంలోనూ అదే పరిస్థితి ఉంది. ఒక్క కేసుకే అనేక మంది సీనియర్ లాయర్లను ఎంగేజ్ చేయడంపై సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. ఒక్క కేసుకు ఎంత మంది సీనియర్ న్యాయవాదుల ను ఎంగేజ్ చేస్తారని సుప్రీం ప్రశ్నించింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ నేతల వ్యక్తిగత కేసులను వాదించేందుకు చెల్లించాల్సిన మొత్తాలను ప్రభుత్వ ఖాతాలో వేయడానికి ఇలా .. ప్రభుత్వ కేసుల్లో కూడా వారిని లెక్కలోకి చేరుస్తారన్న ఆరోపణలను టీడీపీ నేతలను చాలా కాలంగా చేస్తున్నారు. ప్రజాధనం జగన్ లాయర్లకు ఖర్చు పెడుతున్నారని అంటూంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ లెక్కలన్నీ వెలుగులోకి తెస్తే.. కీలకమైన విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.