రాఫెల్ ఒప్పందం విషయంలో రివ్యూ పిటిషన్లపై విచారణ కొనసాగించాలని.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రాఫెల్ డీల్‌లో.. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా జోక్యం చేసుకుందని… హిందూ పత్రిక.. కొన్ని ఆధారాలను బయట పెట్టింది. ఆ ఆధారాలను.. చూపుతూ… రాఫెల్ స్కాం విషయంలో.. తీర్పును పునస్సమీక్షించాలని… మాజీ బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి పిటిషన్ వేశారు. అంతకు ముందు.. కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం.. రాఫెల్ డీల్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించిందని… తప్పుడు సమాచారం ఇచ్చిందని చెబుతూ.. హిందూ పత్రిక బయట పెట్టిన ఆధారాలతో…రివ్యూ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌పై వాదన సమయంలో… రక్షణ శాఖ కార్యాలయం నుంచి.. రాఫెల్ పత్రాలు చోరీ అయ్యాయని.. కేంద్రం వాదిరించింది. దొంగతనానికి గురైన పత్రాలు.. సాక్ష్యాలుగా పరిగణించకూడదని… కేంద్రం తరపున న్యాయవాదులు వాదిరించారు. కానీ… ఆ పత్రాలు దొంగతనానికి గురయ్యాయా.. లేదా అన్నదాని కన్నా.. అసలు ఆ పత్రాలు నిజమా .. కాదా .. అన్న అంశం ఆధారంగానే విచారణ చేయాలని రివ్యూ పిటిషన్ వేసిన వారు వాదించారు. రాఫెల్ పత్రాలు.. ఓ సారి దొంగతనానికి గురయ్యాయని..మరోసారి.. కాలేదని.. కేంద్రం తరపున వాదించింది. ఈ వాదనలను విన్న సుప్రీంకోర్టు.. పత్రాల మెరిట్ ఆధారంగానే విచారమ జరుపుతామని ప్రకటించింది. వాటిని సాక్ష్యాలుగా తీసుకోకూడదన్న… కేంద్రం వాదనను తోసి పుచ్చింది.
రాఫెల్ డీల్ విషయంలో.. అనేక అవకతవకాలు జరిగాయని.. దేశానికి పెద్ద ఎత్తున నష్టం కలిగేలా.. నిబంధనలు మార్చారని..నిపుణులు చాలా కాలం నుంచి ఆరోపిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం.. అసలు అవినీతే జరగలేదని చెబుతోంది. అయితే.. ఏ విషయంలోనూ పాదరదర్శకత లేదు. ఇంత వరకూ ఒక్క రాఫెల్ విమానం కూడా రాలేదు. ఈ క్రమంలో… వస్తున్న అనుమానాలకు కేంద్రం.. సరైన క్లారిఫికేషన్ ఇవ్వడం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు… రాఫెల్ డీల్‌పై విచారణ తీర్పుపై.. రివ్యూ చేసేందుకు సిద్ధపడటం.. రాజకీయంగా సంచలనాత్మకం అయ్యేదే..! . త్వరలో సుప్రీంకోర్టు తేదీలను ఖరారు చేయనుంది.