టీవీ9 రవిప్రకాష్‌ను ఇంకా ఇంకా.. వెంటాడుతూనే ఉన్నారు. ఈడీ కేసుల్లో హైకోర్టు ఆయనకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయించేందుకు చేసిన ప్రయత్నాలు సుప్రీంకోర్టులో ఫెయిలయ్యాయి. ఈడీ కేసుల్లో అరెస్ట్ చేయాల్సి ఉందని.. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే ముందస్తు బెయిల్ ఇచ్చి ఉంటుంది కాబట్టి తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
నిజానికి రవిప్రకాష్ పై ఒకే అంశంపై అనేక రకాల కేసులు పెడుతున్నారు. ఎన్సీఎల్టీలో ఉన్న కేసు విషయంపై తర్వాత నిధుల దుర్వినియోగం అని కేసు పెట్టారు. ఉద్యోగులకు బోనస్ ఇచ్చారని.. ఇలా ఇస్తూ.. తాను కూడా పెద్ద మొత్తం తీసుకున్నారని.. ఆరోపణలు చేశారు. క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈడీ కేసులు పెట్టారు. ఒకే అంశంపై రకరకాల కేసులు పెట్టడం.. బోనస్ అంశంపై నిబంధనల ప్రకారమే జరిగిందని.. వాదిస్తూ.. రవిప్రకాష్ న్యాయపోరాటం చేస్తున్నారు. టీవీ9 కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిన తర్వతా రవిప్రకాష్‌కు ఇక్కట్లు తప్పడం లేదు.
ఆయనను చానల్ నుంచి బలవంతంగా బయటకు పంపడమే కాకుండా.. ఆయనకు ఉన్న మైనర్ వాటాను కూడా.. కేవసం చేసుకునేలా కొత్త యాజమాన్యం ప్రణాళికలు వేస్తోందన్న ఆరోణలు రవిప్రకాష్ వర్గం చేస్తోంది. ఈ క్రమంలో… ఈడీ కేసులో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ను రద్దు చేయడానికి నిరాకరించడం… రవిప్రకాష్‌కు గొప్ప ఊరటగా భావిస్తున్నారు.