వైసీపీ పూజారి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి న్యాయమూర్తులు సహా వైసీపీని వ్యతిరేకించేవారందరిపై తప్పుడు ప్రచారాలు, అసభ్య పోస్టులు పెట్టించిన కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం.. ఏం చెప్పుకవాలన్నా హైకోర్టులో చెప్పుకోవాలని చెప్పి పంపేసింది.
వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేసిన తర్వాత పోలీసులు బూతు మాఫియా అంతా ఓ పెద్ద నెట్ వర్క్ కింద నడుస్తోందని ప్రకటించారు. నర్రా రవీంద్రారెడ్డికి కంటెంట్ రాఘవరెడ్డి నుంచి వచ్చిందని అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే ఇలాంటి పోస్టులు పెట్టారని బయట పెట్టారు. ఈ కేసుల్లో సజ్జల భార్గవరెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన విచారణకు హాజరు కావడం లేదు. తనకు ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం లోకల్ కోర్టుకు వెళ్లారు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు.
మధ్యలో ఆయన హైకోర్టులో ప్రయత్నం చేయడాన్ని స్కిల్ చేశారు. సోషల్ మీడియా పోస్టులపై హైకోర్టుసీరియస్ దగా స్పందిస్తోంది. పిల్ వేసిన విజయ్ బాబు అనే వైసీపీ నేతకు యాభై వేల జరిమానా విధించింది. అరెస్టు అయిన వారి విషయంలో సీరియస్ గా స్పందిస్తూండటంతో హైకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదని భార్గవరెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం హైకోర్టులోనే చెప్పుకోవాలని పంపేసింది.