జగన్ కేసుల్లో రోజువారీ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో ప్రజాప్రతినిధుల కేసుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ కేసుల్లోనూ వర్తిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతున్నందున వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. అలాగే జగన్ బెయిల్‌ను రద్దు చేయాలన్న పిటిషన్‌పై కూడా ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని చెప్పింది.
గతంలో సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులపై కేసులను రోజువారీ విచారణ జరిపి తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మేరకు చిన్న కేసుల విచారణ వేగంగా జరుగుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మాత్రం ముందుకు కదలడం లేదు. ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల అంశాన్ని తేల్చలేదు. సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత తీర్పు చెప్పబోయే ముందు బదిలీ అయ్యేవారు. ఇటీవల తీర్పు ప్రకటించాల్సిన రోజే న్యాయమూర్తి బదిలీ కావడంతో డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పు రాలేదు.
న్యాయవ్యవస్థలోని లొసుగుల్ని వాడేసుకుని జగన్ మోహన్ రెడ్డి తో పాటు ఇతర నిందితులు ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు వేస్తూ కావాలనే విచారణకు రాకుండా చేస్తున్నారన్న ఆరోపణలు, సీబీఐ కూడా పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టు పర్యవేక్షణలో రోజువారీ విచారణ జరుగుతుందని తేల్చడంతో ఇక ముందు కేసు విచార?ణ ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి.