చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అనేక మార్లువాయిదా పడుతూ వచ్చిన పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. ఇప్పటికే చార్జిషీట్ కూడాదాఖలు చేశారని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. చార్జిషీటు కూడాదాఖలయినందున ఇక జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం భావించింది. ప్రభుత్వ పిటిషన్ ను కొట్టివేస్తూనిర్ణయం తీసుకుంది.
ఇదే అంశంపై దాఖలైనా ఓ ఇంటర్ లొకేటరీ పిటిషన్ పైనా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక విలేఖరి బాలగంగాధర్ తిలక్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరెవరు, మీకేం సంబంధం, పిల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించడంతో జర్నలిస్ట్ తిలక్ న్యాయమూర్తికి ఏం చెప్పాలో తెలియలేదు. బెయిల్ వ్యవహారాల్లో థర్డ్ పార్టీ ఎందుకు ఉంటారని ధర్మాసనం ప్రశ్నించింది. సంబంధ లేని బెయిల్ వ్యవహారాల్లో పిటిషన్ ఎలా వేస్తారని జస్టిస్ బేలా త్రివేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇంకోసారి జరిగితే… తీవ్ర పరిణామాలు ఉంటాయని ధర్మాసనం హెచ్చరించింది. బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను డిస్మిస్ చేసింది.
అధికారంలోకి లేకపోతే వైసీపీ నేతలు.. వివిధ రంగాల నుంచి కొంత మందిని ఎంపిక చేసుకుని వారి పేరుతో పిటిషన్లను వివిధ కోర్టుల్లో దాఖలు చేస్తూ ఉంటారు.. ఈ తిలక్ అనే జర్నలిస్టును పేరును వాడి ఇప్పటికే హైకోర్టులో ఓ సారి పిటిషన్ వేశారు. వైసీపీ హయాంలో నమోదు చేసిన తప్పుడు కేసులను కొత్త ప్రభుత్వం సమీక్షించే అవకాశం ఉండటంతో హైకోర్టులో ఈ తిలక్ పేరుతో పిటిషన్ వేశారు. అప్పుడే హైకోర్టు గట్టిగా హెచ్చరించింది. రాజకీయ కారణాలతో నమోదుచేసిన కేసులను పునఃసమీక్షించకుండా ప్రభుత్వాన్ని ఎలా నిరోధించగలమని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వహక్కును తాము ఎలా అడ్డుకోగలమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా, అంతిమంగా కేసులుఉపసంహరించాలా.. లేదా అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచక్షణాధికారమని స్పష్టం చేసింది.
హైకోర్టులో ఇలాంటి షాక్ తిన్న తర్వాత అదే తిలక్ పేరుతో సుప్రీంకోర్టుకు వచ్చి.. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఇంటర్ లొకేటరీ పిటిషన్ వేశారు. తాను స్వర్ణాంధ్ర అనే పత్రికను నడుపుతున్నానని చెప్పుకుంటున్నారు తిలక్. అలాంటి వార్తా పత్రికే లేదని లాయర్లు గతంలో హైకోర్టుకు తెలిపారు. అయితే జర్నలిస్టు అనే పేరు వాడితో కోర్టుల్లోవెయిట్ ఉంటుందని వైసీపీకి చెందిన కొంత మంది చావు తెలివితేటలతో ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతు