అమరావతిలోని ఆర్ 5 జోన్లో సెంటు స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి ఆటంకాలు తొలగిపోయాయి. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు కూడా నిరాకరించింది. ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా నిలుపదల చేయలేమని స్పష్టం చేసింది. అలాగే సుప్రీంకోర్టు కూడా తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కానీ .. పట్టాల పంపిణీ చేసుకోవచ్చు కానీ భూయాజమాన్య హక్కులు మాత్రం.. దఖలు పడవని.. అమరావతి పిటిషన్ల తుది తీర్పును బట్టి మాత్రమే హక్కులు దాఖలు పడతాయని స్పష్టం చేసింది. అంటే ప్రభుత్వం పట్టాలిస్తుంది కానీ అవి కోర్టు కేసుల్లో ఉన్నట్లన్నమాట.
సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం పేదలకు కేటాయించే స్థలాలు ఆర్ 3 జోన్ లో ఉంటాయి. ఆర్5 జోన్లో ఐటీ సంస్థలకు భూములు కేటాయిస్తారు. కానీ ప్రభుత్వం కుట్ర పూరితంగా చట్టాన్ని మార్చింది. మార్చే అధికారం లేదని హైకోర్టు స్పష్టమన తీర్పు ఉన్నప్పటికీ.. అన్నీ చేసేస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు విచారణలో ఉన్నాయి. జూలైలో విచారణ జరగాల్సి ఉంది. రైతులు ప్రభుత్వం తమకు తమకు ఇచ్చిన ఎలాంటి హామీల్ని నెరవేర్చకపోగా.. తాము ఇచ్చిన భూముల్ని మాత్రం పేద పేరుతో ఓటు బ్యాంకులకు పంపిణీ చేస్తోందని రైతుల ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఒప్పంద ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదంటున్నారు.
ఒక వేళ అమరావతి రైతులకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వస్తే పేదలు బలైపోతారు. నిజానికి ప్రభుత్వం ఇవ్వదల్చుకుంటే బయట ఎక్కడైనా ఇవ్వొచ్చు. కానీ ఇతర ప్రాంతాల వారికి అమరావతిలోనే .. రైతులు ఇచ్చిన భూములనే ఇవ్వాలనే పట్టుదలగా ఉంది. న్యాయస్థానాల్లోనూ స్టే రాకపోవడంతో.. రైతుల భూముల్ని వారి కళ్ల ఎదురుగానే ఉచితంగా ఇతరులకు పంపిణీ చేస్తున్నారు. పేదల్ని అడ్డం పెట్టుకుని రాజకీయ చదరంగం ఆడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.