ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి గట్టి వార్నింగ్ వచ్చింది. రాజకీయాల కోసం కోర్టుల్ని వాడుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఆళ్లకు ఇది ఓపెనింగేనని ఆయన చేసిన నిర్వాకాలు.. తప్పుడు పిటిషన్లు, తప్పుడు ఫిర్యాదులపై ఇక వరుస బ్యాటింగ్ ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండే జగన్ ఆళ్లను పిటిషన్ల కోసం వాడుకున్నారు. 2014-19 సమయంలో ఎన్ని పిటిషన్లు వేశారో లెక్కే లేదు.
అమరావతి సత్రానికి సంబందించిన భూములు చెన్నైలో ఉన్నాయో లేవో తెలియని స్థితిలో ఉంటే వాటిని వేలం వేయడానికి ప్రయత్నిస్తే ఆయన కోర్టులో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వేల కోట్లు కాదు.. అరవై కోట్లు కట్టమన్నా కట్టకుండా పారిపోయాడు. చివరికి ఆ భూములు ఎవరికీ దక్కకుండా పోయాయి. వేలం కూడా జరగలేదు. ఇలాంటి కోర్టు్లో వేసిన పిటిషన్లతో పాటు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత .. బాధితులు ఎవరూ లేకపోయినా.. ఆయన ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఇన్నర్ రింగ్ రోడ్ సహా పలు కేసులు పెట్టారు. వాటన్నింటి విషయంలో ఇప్పు్డు అసలు కథ ప్రారంభం కానుంది.
వచ్చే రోజుల్లో ఆళ్లకు కోర్టుల నుంచే కాదు.. ఆయన చేసిన నిర్వాకాల గురించి కాదు.. ముుందుగా ఆయన చేసిన ఫిర్యాదుల విషయంలోనే ఆయనకు మ్యూజిక్ స్టార్టయ్యే చాన్సులు ఉన్నాయి. తప్పుడు కేసులు పెట్టడానికి ఆయన ఓ పిల్లర్ లా మారిన వైనం కారణంగానే .. ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఆయన పెద్దగా బయట కనిపించడం లేదు. కానీ ఆయనకు మ్యూజిక్ మాత్రం స్టార్టవుతుందని.. పొన్నవోలును దగ్గర పెట్టుకుని ముందస్తు బెయిల్స్ కోసం పత్రాలు రెడీ చేసుకోవాలని టీడీపీ నేతలు సలహాలు ఇస్తున్నారు.