పూరి దర్శకత్వంలో నటించే కథానాయికలకు ఓ సెపరేట్ క్రేజ్ ఉంటుంది.. ఇక పూరి పరిచయం చేసే హీరోయిన్స్ అయితే పరిశ్రమను ఏలడం ఖాయం అనేస్తుంటారు. ప్రస్తుతం తన సినిమాల ఫలితాలతో అసంతృప్తిగా ఉన్న పూరి తీస్తున్న ‘రోగ్’ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నందమూరి హీరోలు కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ లతో సినిమాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.
తెలుస్తున్న సమాచారం ప్రకారం పూరి, కళ్యాన్ రాం సినిమా టైటిల్ రీమిక్స్ అని పెట్టబోతున్నారట. ఇక ఈ సినిమాలో కథానాయికగా ఎక్స్ ప్రెస్ పాప సురభిని తీసుకునే ఆలోచనల్లో ఉన్నారట. రఘువరన్ బి.టెక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సురభి సందీప్ కిషన్ బీరువాతో స్ట్రైట్ తెలుగు సినిమాలో నటించింది. ఇక ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా రీసెంట్ గా వచ్చిన ఎక్స్ ప్రెస్ రాజాతో సూపర్ హిట్ కొట్టింది.
శర్వానంద్, సురభిల జోడీ స్క్రీన్ కే అందం వచ్చేలా చేసింది. ఇక ఈ అందాల భామ పూరి కన్నుల్లో పడ్డది అందుకే పూరి తను తీస్తున్న కళ్యాన్ రామ్ రీమిక్స్ లో హీరోయిన్ గా అవకాశం చేజిక్కించుకుంది. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్ లో ఉన్న పూరి త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి డీటేల్స్ వెళ్లడిస్తాడట.