హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి చివరి క్షణంలో పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి… రోజంతా హంగామా చేసినప్పటికి నామినేషన్ వేయలేకపోయారు. అవసరమైన పత్రాలు లేకపోవడం… బాధ్యత తీసుకున్న వారందరూ లైట్ తీసుకోవడంతో.. ఆమెకు కష్టాలు ఎదురయ్యాయి. చివరికి కార్యాలయానికి వెళ్లి కూడా నామినేషన్లు పత్రాలు సరిగ్గా లేకపోవడంతో రేపటికి వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లకు చివరి రోజు. రేపు నామినేషన్ వేయకపోతే.. ఆమె బరిలో లేనట్లే అవుతుంది.
కేసీఆర్ పీవీ కుమార్తె పేరును ఖరారు చేసిన తర్వాత టీఆర్ఎస్ నేతలు ఆమెను సంప్రదించారు. ఆమె కూడా సిద్ధమయ్యారు. వెంటనే… మూడు జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ నేతల్ని పిలిచి… కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. వాణిదేవిని ప్రగతి భవన్కు పిలిచి బీఫామ్ ఇచ్చిపంపించారు. దగ్గరుండి నామినేషన్ వేయించాలని పంపించారు. అందరూ కలిసి ర్యాలీగా నామినేషన్ వేసేందుకు గ్రేటర్ ఆఫీసుకు వచ్చారు. అయితే నామినేషన్ ఫారం సరైన ఫార్మాట్లో లేకపోవడంతో అధికారులు తీసుకోవడానికి నిరాకరించారు. మరో సెట్ రెడీ చేసేసరికి సమయం మించి పోయింది.అయితే చివరి క్షణంలో ఆమె పేరు ఖరారు చేయడంతో అవసరమైన పత్రాలన్నీ సమకూర్చుకోవడం ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయం టీఆర్ఎస్లో వినిపిస్తోంది.
కేసీఆర్ ను టార్గెట్ చేశాయి. నేరుగా నామినేట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఓడిపోయే సీటులో నిలబెడుతున్నారని.. పీవీకి కేసీఆర్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ ల నుంచి ఈ తరహా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ నేతలు మాత్రం… ఖచ్చితంగా గెలిచే సీటు కాబట్టి… ఇచ్చామని అంటున్నారు.